Kavithalu in Telugu is a beautiful expression of emotions, dreams, and experiences that resonate with our audiences. Telugu kavithalu on life and love have a special place in every Telugu-speaking person's heart, and it's no surprise considering the rich literary heritage. Whether you're looking to share your feelings or captivated by the depth of the human experience, Telugu kavithalu on love, Amma kavithalu in Telugu, Sri Sri kavithalu Telugu, nanna kavithalu in Telugu, and nanna pai kavithalu
ఓ ముగ్ద మనోహర సౌందర్య రాశీ - 14.01.2020
ఓ ముగ్ద మనోహర సౌందర్య రాశీ,
చిలిపి చిరునగువు తోనికించే కనుబొమ్మల దిగువున,
రెప రెపలాడే కనుబొమ్మల నడుమ,
కొంటె చూపు విసిరే కొనంగి కళ్ళ చిన్నదానా,
నీ చిరు నగవు చూసి తబ్బుబ్బైతినే,
వయ్యారాలు వలికించే నీ నాయగారాల నడుము చూసి,
తికమక పడితినే!!
ఓసీ చిన్నదానా, మనసు పడ్డానే నీ పైన!!!
కన్నయ్య...కృష్ణయ్య - 11-06-2015
దేవకీ పుత్రుడు కృష్ణయ్య
యసోద తనయుడు కన్నయ్య
బుడి బుడి నడకల బుజ్జి కృష్ణయ్య
బుడ బుడ ముంచెనే కాలీయ సర్పాన్ని
అన్నెం ఎరుగని కొంటె కృష్ణయ్య
కన్నెల మనసులు దోచెనే
అమ్మ చాటు కన్నయ్య
వెన్న దొంగ ఎలా అయ్యనే?
గోవులు కాచే గోపాలా
కంస మామ పాలిట యమలీల
బృందావనమిది అందరిదీ
గోవిందుడు అందరి వాడేలే
పదిలంగా ఉండు నేస్తమా - 11-03-2015
ప్రేమలు మాత్రం మనుషుల మనసుల్లోనే పుడతాయి
స్వర్గంలోజరిగిన పెళ్ళి గుర్తొచ్చిందా ప్రేమించిన నన్ను మర్చిపొయావు
ప్రేమ అన్నావు జీవనపయనం నాతోనే అన్నావు అన్నీ వదిలివస్తే నడి యడారిలో నిర్దాక్షనీయంగా వదిళెళ్ళావు
నా చేతిలో ముళ్ళుమొలిచాయా వదిలేసి మరో చెయ్యి పట్టుకున్నావు
నా కళ్ళు ఇష్టమన్నావు అందుకేనా జీవితాంతం కన్నీరు కార్చేలా చేసావు
అందాల పెళ్ళికూతురివయ్యావు కానీ నీ పక్కన పెళ్ళికొడుకుగా నేనులేను
చెమ్మగిల్లిన కళ్ళు నిన్ను చూడనివ్వటంలేదు గుండె నిండిన నీ రూపం మాయమవ్వటంలేదు
నువ్వింక రావనితెలుసు నీతోడులేని జీవితాని ఎల జీవించాలో తెలియడంలేదు.....
పదిలంగా ఉండు నేస్తమా ఎక్కడున్నా ఏంచేసినా నా తలపులు నీతోనే .........
********************************************

09-03-2015
నా గుండెల్లో దీపం...మరో ఇంటి వెలుగయ్యింది...08/03/2015
---------------------------------------------------------

....................................................
30-01-2015 - రాలుతున్న కన్నీటిలో వున్నావని చూపుతున్నా ప్రతిక్షణం
Miss You

అప్పుడంతా నువ్వే... అన్నీ నువ్వే... ఇప్పుడంతా శూన్యం... 21-11-2014
ఒంటరి ప్రాణం - 21-11-2014
ఎలా ఎలా.... నిను చేరేదెలా... నిను మరిచేదెలా... 19-11-2014
దూరం కానంటున్నది క్షణమైనా ... గుండెల్లో నీ ప్రతిరూపం ...
మిగిలే వున్నా ముక్కలైన మనసును ఏరుకుంటూ...
బ్రతికే వున్నా కోల్పోయిన నన్ను నేను వెతుక్కుంటూ...
మనస్సు తలుపు తెరచి చూడు దాచుకున్న ఈ ప్రేమని...
మౌనం వీడి చెప్పు దాచుకొన్న ఆ మాటని...
నీకై ఎదురుచూసిన చూపులు.... నీ ప్రేమకై పరితపించిన రోజులు....
నీకై రాసుకున్న కవితలు.. మిగిల్చాయి మరువలేని చేదు జ్ఞాపకాలు...
కనులు మూస్తే కలలలోను...
కనులు తెరిస్తే కవితల్లోనూ...
నిలుచున్నా నువ్వే ...
నడుస్తున్నా నువ్వే...
నిను మరిచేదెలా...
ఈ భాధకు ముగింపెలా....
అమ్మ - 11-10-2014
కనులు తెరిచిన మరుక్షణం కనబడేది నీ రూపం .. అమ్మా...
నీ ఆత్మ శరీరం పంచి నాకు పునర్జన్మను ఇచ్చిన దివ్య రూపం నీది...
నీ రక్తాన్ని పాలుగా మార్చి నా ప్రాణం నిలిపావు అమ్మా నువ్వు...
నా హృదయం నోచుకుంటే విలవిలలాడావు అమ్మా...
నా మౌనం సైతం అర్థం చేసుకున్న మనస్సు అమ్మా నీది...
నా ప్రాణానికి నీ ప్రాణం సైతం అడ్డు వెయ్యడానికి వెనుకాడని మనస్సు అమ్మా నీది...
నా పెదవి పై చిరునవ్వు నీ గెలుపుగా భావిస్తావు...
చివరి క్షణం వరకు నాకై తపిస్తావు నువ్వు...
అమ్మా...
నా చివరి శ్వాస నిన్ను చూస్తూ నీ ఒడిలో వదలాలని తపిస్తున్నాను...
ప్రేమ అనే పదానికి అర్థం నువ్వు...
నీ ప్రేమ అమూల్యం అమ్మా...
నీ ఋణం తీర్చుకోలేనిది అమ్మా....
ప్రేమతో...
నీ..
బన్ను
అమ్మ

ఆరోజుకు... - 27-03-2014
నన్ను నీ వైపుకు లాగిన రోజుకు,
నా చేతిలో నీ చెయ్యేసిన రోజుకు,
ఇంకొక చేతిని నా చుట్టూ వేసుకున్న రోజుకు.
సున్నితంగా నా చెవిలో గుసగుసలు చెప్పిన రోజుకు,
నా బుగ్గపై చిరు ముద్దులు పంచిన రోజుకు,
నా గమ్యానికి దారి చూపిన రోజుకు,
నా చుట్టూ వున్నది శూన్యం,
నువ్వు మాత్రమే నా ఆధారం,
నన్ను తీసుకుపో ఆరోజుకు......
కన్నీళ్ళు - 25-03-2014

ప్రేమ..... ద్వేషం - 25-03-2014
తపన - 23-03-2014
మనసు తపిస్తోంది..........
కన్నులు తపిస్తున్నాయి.......
చెవులు తపిస్తున్నాయి...........
ప్రేమ కోసం మనస్సు తపిస్తోంది.......
చూపు కోసం కన్నులు తపిస్తున్నాయి......
పిలుపు కోసం చెవులు తపిస్తున్నాయి..........
కన్నుల్లో నీ రూపం రెప్పవేయనీకుంది......
హృదయంలో నీ ప్రతిరూపం అలజడి చేస్తోంది......
కష్టం, నష్టం నాకే సొంతం......
నీ సంతోషం నా జీవన గమ్యం......
బాహ్య రూపం కఠిన శిలలా వున్నా,
అంతరంగం పరితపిస్తోంది.......
ప్రియతమా....
నువ్వు కుశలమా?
ప్రేమతో,
కవల హృదయం.
ప్రేమికుడు - 20-03-2014
ప్రేమ ఒక తియ్యటి విష బీజం. మొక్క పెరిగే కొద్దీ అందంగా వుంటుంది, చివరలో ప్రాణం తీస్తుంది.
ఆడవారి మనసు సముద్రపు అలల లాంటిది. సముద్రపు అలలు పారుతూ వచ్చి తనలో కలిసే నీటిని తనలో ఐక్యం చేసుకొని తనలాగే మార్చేస్తుంది. కలసిన నీరు బయటకు రావాలన్న బయటకు రాలేదు, తన పూర్వ గుణాన్ని పొందలేదు.
మగాడి మనస్సు పారే నది లాంటిది. పారే నీరు తను వెళ్ళే దారిలో అందరికి మంచి చేసి ప్రేమను పంచుతుంది. తనను అహ్వానించినవారిలో కలిసిపోతుంది (సముద్రంలో). కలిశాక తిరిగి రాలేని పరిస్థితి. కలిశాక తన రూపం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, నియంత్రణ కోల్పోతుంది. తనకు సముద్రపు అలలే సర్వస్వం. తనే లోకం. తనే జీవితం. బయటికి రావాలన్నా రాలేదు, మారాలన్నా మారలేదు. తనిక అలా బ్రతకాల్సిందే.
సముద్రపు అల తనకు ఒక పరిదిని ఏర్పరచుకుంటుంది. తనలోని భావోద్యోగాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. తనలోకి వచ్చిన వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, తను ప్రశాంతంగా వుంటే ఇతరులను అలరిస్తుంది. ఫరిది దాటి రమ్మంటే రానంటుంది.
ఆడవారి జీవితానికి, మగవాడి జీవితానికి వున్న వ్యత్యాసం ఇదే.
ఆశ్రయం - Curtosy "Vaarta - 20/02/2005
నిర్ణయించుకున్నాయి కనురెప్పలన్నీ.
ఆ రాత్రి ఎక్కడ తలదాచుకోవడమని
గిలగిలలాడింది నిద్ర.
విచ్చుకుంటున్న ఒక పువ్వును వేడుకుంది
తనకు ఆశ్రయమివ్వవలసిందిగా.
"ఇప్పుడే నీకు ఆశ్రయమిస్తే
నా రేకులన్ని ముడుచుకుపోయి
తెల్లవారేలోగానే నేను నేలమీద రాలిపడి
నా ఉనికినే కోల్పోతాను.
వీల్లేదు పో"
అని తిప్పికొట్టింది ఆ పువ్వు.
దిక్కుతోచని నిద్ర
తన వేదనను గాలికి నివేదిన్చుకుంది.
"చలనం నా జీవం
నిన్ను చేరదీస్తే ఇంకేముంది
ఉన్నచోటనే నిలువునా స్తంభించిపోతాను.
మనిద్దరికీ కుదరదు పో"
అంటూ దులిపేసుకుంది గాలి.
మంచుగడ్డను అభ్యర్థించింది నిద్ర
ఆ ఒక్కరాత్రి తనను ఒళ్ళోకి
తీసుకొమ్మని
ఉలికిపడి మంచుగడ్డ అంది
"నిన్ను నాలోన చేర్చుకుంటే ఇంకేమైనా ఉందా
మిగిలేది స్తబ్దతే.
ఆ గుణమే నా ఒంటబడితే
ఉదయకిరణాల
నులివేచని కౌగిలింతలో
కరిగిపోయే యోగం నాకుండదు.
వెంటనే వెళ్ళిపో".
ఏ గత్యంతరం లేక
చేతులెత్తి మనసుతో మొరపెట్టుకుంది నిద్ర
తనకు ఆ పూట విడిది కల్పించవలసిందిగా
చెతికెలో సమస్త జీవరాశులను ఆక్రమించే
అదృశ్య శక్తిగా వున్న నిద్రపైన
జాలి కలిగింది మనసుకు.
అయ్యో పాపమనుకుంది.
పంచేంద్రియ సంచార క్రియలను ఆపేసింది.
నిర్వికార స్థితిని తనలో ఆవహింపజేసుకుంది.
అంతే మరి
మసక కమ్మింది మగత పెరిగింది.
అది గమనించిన నిద్ర
కళ్ళలోకి నెమ్మదిగా చొరబడి
విప్పారిన కనురెప్పలను కప్పుకుని
సుఖంగా ఒదిగి పడుకుంది
జాలి మనసుకు
కృతజ్ఞతలర్పించుకుంటూ
-- డా,, సి. నారాయణరెడ్డి
05/01/2014 - Life is a Wave
04/01/2014 - మా కన్నీటి బొట్టువై రాలావు - ధృవ తారవై వెలిగావు
23/12/2013
Nee andam seethakaalam sayankalam lantidi, nee prema vasantha kalam lantidi, nee manasu seethakaalapu udayam lantidi, nee kopam sisira ruthuvu lantidi, nee vedana varsha kaalam lantidi
22/12/2013
Ompu sompula sayyatallo, nadumompula kavvintallo, eda pongulu orristunte, tadi aarani pedavula makarandam maimarapistunte, sigalo mallelu mattekistunte, naa chili vachati kougili raa rammantunte, nenetta aagede chinnadaana ! Nenetta orrookonede kurraadaana
19/12/2013 - 4
Gatha janmala karma phalam, dasa disala daiva bhalam, thodaithe dinam dinam, avuthundi janma dhanyam
19/12/2013 - 3
Karthavyam nirdesinchake puttuka jaruguthundi. Okaru chebithe telisedi kadu karthayam, gnana samaparjanatho nirvarthinchede karthavyam
19/12/2013 - 2
Prayatnam nee karthavyam, phalitham daiva nirnayam. Pahlitha nirnayam nee morrkhatvam, antya phalitham neekandina prathiphalam
19/12/2013 - 1
Doopam vundi, deepam vundi, veliginchina nippu vundi, Nippu daivam, doopam deepam daivatvam, kaani nippunu srustinchina aadharam alpam
ప్రియ సఖి - 2001
ఇదో అద్భుతమైన సాయం సంధ్య వేళ. మనసెందుకో ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పక్షుల కిలకిలలు, సెలయేరు గలగలలు, ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి తనకేసి ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒడ్డును ప్రేమగా పలకరించి, ఆర్తిగా ఓ చిన్న ముద్దు ఇచ్చి మళ్ళీ నీకై తిరిగొస్తానని చెవిలో మెల్లగా చెప్పి వెనుదిరిగిన అలలు ఈ సాయంకాలపు ఆహ్లాదాన్ని రెచ్చగొడుతున్నాయి.
చిటపట చినుకుల చిరు సవ్వడి - 1996
లయ తప్పించే పిల్లగాలిలో,
నేనుంటే నా చెలి ఒడిలో,
హద్దే వుండదు మాకీ జగతిలో.