కమ్మటి తెలుగు కవితలు

ఓ ముగ్ద మనోహర సౌందర్య రాశీ - 14.01.2020

ముగ్ద మనోహర సౌందర్య రాశీ,

చిలిపి చిరునగువు తోనికించే కనుబొమ్మల దిగువున,

రెప రెపలాడే కనుబొమ్మల నడుమ,

కొంటె చూపు విసిరే కొనంగి కళ్ళ చిన్నదానా,

నీ చిరు నగవు చూసి తబ్బుబ్బైతినే,

వయ్యారాలు వలికించే నీ నాయగారాల నడుము చూసి,

తికమక పడితినే!!

ఓసీ చిన్నదానా, మనసు పడ్డానే నీ పైన!!!

కన్నయ్య...కృష్ణయ్య - 11-06-2015

దేవకీ పుత్రుడు కృష్ణయ్య
యసోద తనయుడు కన్నయ్య

బుడి బుడి నడకల బుజ్జి కృష్ణయ్య
బుడ బుడ ముంచెనే కాలీయ సర్పాన్ని

అన్నెం ఎరుగని కొంటె కృష్ణయ్య
కన్నెల మనసులు దోచెనే

అమ్మ చాటు కన్నయ్య
వెన్న దొంగ ఎలా అయ్యనే?

గోవులు కాచే గోపాలా
కంస మామ పాలిట యమలీల

బృందావనమిది అందరిదీ
గోవిందుడు అందరి వాడేలే

పదిలంగా ఉండు నేస్తమా - 11-03-2015

పెళ్ళిళ్ళు స్వర్గంలొనే జరుగుతాయి
ప్రేమలు మాత్రం మనుషుల మనసుల్లోనే పుడతాయి
స్వర్గంలోజరిగిన పెళ్ళి గుర్తొచ్చిందా ప్రేమించిన నన్ను మర్చిపొయావు
ప్రేమ అన్నావు జీవనపయనం నాతోనే అన్నావు అన్నీ వదిలివస్తే నడి యడారిలో నిర్దాక్షనీయంగా వదిళెళ్ళావు
నా చేతిలో ముళ్ళుమొలిచాయా వదిలేసి మరో చెయ్యి పట్టుకున్నావు
నా కళ్ళు ఇష్టమన్నావు అందుకేనా జీవితాంతం కన్నీరు కార్చేలా చేసావు
అందాల పెళ్ళికూతురివయ్యావు కానీ నీ పక్కన పెళ్ళికొడుకుగా నేనులేను
చెమ్మగిల్లిన కళ్ళు నిన్ను చూడనివ్వటంలేదు గుండె నిండిన నీ రూపం మాయమవ్వటంలేదు
నువ్వింక రావనితెలుసు నీతోడులేని జీవితాని ఎల జీవించాలో తెలియడంలేదు.....
పదిలంగా ఉండు నేస్తమా ఎక్కడున్నా ఏంచేసినా నా తలపులు నీతోనే .........

Courtesy: Krishna

********************************************

********************************************

09-03-2015

అందమైన నీ రూపం చూశా,
మధురమైన నీ పరిమళాన్ని ఆశ్వాదించా..
ప్రేమకు చిహ్నమైన నీ రూపం వెనుక...
గుండెను చిద్రం చేసే ముల్లుందని ఊహించలేదు..

నా గుండెల్లో దీపం...మరో ఇంటి వెలుగయ్యింది...08/03/2015

నా గుండెల్లో దీపం మనస్సును చీకటి చేసి ....
మరో ఇంటి వెలుగయ్యింది.....
బరువెక్కిన గుండెలతో ...
నోట మాట రాక గొంతు మూగబోయింది...
పెల్లుబికిన కన్నీటిని రెప్పల చాటున దాచిపెట్టి...
నీ కాపురం నూరేళ్ళు చల్లగా వుండాలని ఆశీర్వదిస్తున్నా నేస్తమా...
నిన్నటి నా ప్రియతమా...

వేదనతో...
ఎప్పటికి నీ.....
నేను.

శూన్యం మిగిలింది - 23-02-3015

ప్రేమ పోయింది...
నమ్మకం పోయింది...
శూన్యం మిగిలింది ...
ప్రేమించే హృదయాన్ని ఎంత భాదపెట్టినా...
అది ప్రేమించాక మానదు...
కానీ ఆ హృదయాన్నే గాయపరిస్తే.....

---------------------------------------------------------

---------------------------------------------------------

....................................................

....................................................

30-01-2015 - రాలుతున్న కన్నీటిలో వున్నావని చూపుతున్నా ప్రతిక్షణం

ఏదో ఒక రోజు ......
నన్ను వదిలి వెళ్ళిన నువ్వు...
ఒంటరిగా కూర్చొని....
కంటి నిండా నీటితో...
గడచినా కాలాన్ని తలచుకుంటూ...
కుములిపోతుంటావని నాకు తెలుసు...
ఎందుకంటే...
మనది నిజమైన ప్రేమ...
నా ప్రతి అడుగులో నువ్వే...
నీ ప్రతి కదలికలో నేనే...
నిదుర లేచి చూసే మొదటి రూపం నీది...
నిదురోయే క్షణం తలచే జ్ఞాపకం మనది...
నీ కలలో నేనే... నీ శ్వాసలో నేనే...
నా కలలో నువ్వే... నా శ్వాసలో నువ్వే...

కంటిలో దాగిన కన్నిటికి తెలుసు....
వాటి వెనుక ఉన్న రూపం నీదని...
నువ్వు గడిపే క్షణాన్ని అడుగు...
మనం గడిపిన క్షణాల విలువ ఎంతని...
గాయమైన నా మనస్సును అడుగు...
నీపై వున్నా ప్రేమ ఎంతని...

నీ ప్రేమతో నన్ను వెలుగులోకి తెచ్చావు...
మనిషిగా నన్ను మట్టిపై నిలిపావు...

మిగిలే వున్నా ముక్కలైన మనస్సును ఏరుకుంటూ...
బ్రతికే వున్నా కోల్పోయిన నన్ను నేను వెతుక్కుంటూ...

అప్పుడు నా గుండెల్లో ఊగావు ఉయ్యాలలు...
ఇప్పుడు నా మనసున రేపావు జ్వాలలు...
అప్పుడు నా కన్నుల్లో నింపావు నీ కలలు...
ఇప్పుడు కనులయ్యాయి కన్నీటి కలువలు...
ఎక్కడని వెతకను నీ ఊపిరి జాడలు...
ఒక్క పలకరింపుతో తగ్గించలేవా ఈ దూరాలు...

నీతో చెప్పాలనుకున్న నా గుండె కోతను...
విన్నవించలేకున్నా నీ మనస్సుకు....

ఎక్కడో పుట్టాము... ఎక్కడో పెరిగాము... కవల హృదయమై మెలిగాము...
మనస్సు లాగుతోంది నీ వైపు రమ్మని...
నువ్వెక్కడని నిలదిస్తోంది నా ప్రాణం...
ఏమని చెప్పను దానికి సమాదానం...
నువ్వు దూరమయ్యావని చెప్పనా...
నువ్వు ఇంక రావని చెప్పనా...

ఆదేవుని వరమనుకోనా నీ పరిచయం...
నీ దూరం శాపమనుకోనా ఈ క్షణం...
నువ్వెక్కడని ప్రశ్నిస్తుంటే నా అంతరంగం...
రాలుతున్న నా కన్నీటిలో వున్నావని చూపుతున్నా ప్రతిక్షణం...

Miss You

Miss You

అప్పుడంతా నువ్వే... అన్నీ నువ్వే... ఇప్పుడంతా శూన్యం... 21-11-2014

మాటలో నువ్వే...
పిలుపులో నువ్వే...
పీల్చే గాలిలో నువ్వే...
చూసే చూపులో నువ్వే...
ఎదుటా నువ్వే...
ఎదలో నువ్వే...
నడకలో నువ్వే...
నడతలో నువ్వే...
తిండిలో నువ్వే...
నీటిలో నువ్వే...
ఆలోచనల్లో నువ్వే...
ఆచరణలో నువ్వే...
ప్రేమా నీదే...
స్వార్థం నీదే...
మెలుకువలో నువ్వే...
నిదురలో నువ్వే...
ఊహల్లో నువ్వే...
స్వప్నంలో నువ్వే...

శూన్యం... శూన్యం... శూన్యం...
ఇప్పుడంతా శూన్యం...
పగలూ శూన్యం...
రాత్రీ శూన్యం...
మాటలు శూన్యం...
ఆటలు శూన్యం...
నడకా శూన్యం...
నడతా శూన్యం...
పిలుపు శూన్యం...
పిలిచే గాలీ శూన్యం...
ఊహల్లో శూన్యం...
ఆచరణలో శూన్యం...
ప్రేమలో శూన్యం...
ఆచరణలో శూన్యం...
ఇలలో శూన్యం...
స్వప్నంలో శూన్యం...

శూన్యం... శూన్యం.... శూన్యం... స్వర్వం శూన్యం...

ఒంటరి ప్రాణం - 21-11-2014

నిన్నటి వరకు నువ్వు నేను ఒకటే అనుకొన్న ప్రాణం
నేడు నువ్వు లేక ఒంటరైపోయింది.
ప్రేమగా పలకరించే నీ పెదవుల్లో మౌనం....
అనుభవిస్తున్న నా గుండెకు తగిలెను గాయం..
నేస్తం నిన్ను మరువలేను... తలరాతకు తలవంచలేను...
దారి కాని దారిలో ఎదురొస్తావ్...
వేళ కాని వేళలో గుర్తొస్తావ్...
మాటల్లో చెప్పలేను నా భాదను...
నీ కళ్ళకు చూపలేను గుండెకు తగిలిన గాయాన్ని..
కలసిన క్షణం గుర్తుకు రాదు..
నీ ప్రేమలో గడిచిన రోజులెన్నో లెక్కకి రావు..
నీవులేని క్షణంలో మిగిలాయి గురుతులెన్నో...
ఒంటరిగా వున్నా... నీ వెంటే ఉన్నానన్న ఆలోచన...
నేనేమి చేస్తున్నా పలకరిస్తుంది నీ ఆలోచన...
నిన్ను వదిలి ఉండలేనని తెలుసు... కానీ ఎంత దూరం అవుతున్నావో మనసుకు తెలుసు...
ఈ క్షణం కలిగెను ఒక కోరిక...
నీ స్వరం వినాలని తియ్యగా...
నువ్వు ఎదురు లేకున్నా చూస్తూనే వుంటాను...
నీకు నేను గుర్తుకు రాకున్నా ... నీ ఆలోచనలలో వుంటాను...
నువ్వు నన్ను విడిపోయినా.... నీ కోసం వేచి వుంటాను...

ఎలా ఎలా.... నిను చేరేదెలా... నిను మరిచేదెలా... 19-11-2014

కన్నుల్లో కదిలే నీ రూపం ... నిదురోనియ్యదు ఏ నిముషం..
దూరం కానంటున్నది క్షణమైనా ... గుండెల్లో నీ ప్రతిరూపం ...
మిగిలే వున్నా ముక్కలైన మనసును ఏరుకుంటూ...
బ్రతికే వున్నా కోల్పోయిన నన్ను నేను వెతుక్కుంటూ...
మనస్సు తలుపు తెరచి చూడు దాచుకున్న ఈ ప్రేమని...
మౌనం వీడి చెప్పు దాచుకొన్న ఆ మాటని...
నీకై ఎదురుచూసిన చూపులు.... నీ ప్రేమకై పరితపించిన రోజులు....
నీకై రాసుకున్న కవితలు.. మిగిల్చాయి మరువలేని చేదు జ్ఞాపకాలు...
కనులు మూస్తే కలలలోను...
కనులు తెరిస్తే కవితల్లోనూ...
నిలుచున్నా నువ్వే ...
నడుస్తున్నా నువ్వే...
నిను మరిచేదెలా...
ఈ భాధకు ముగింపెలా....

అమ్మ - 11-10-2014

అమ్మా !!!
కనులు తెరిచిన మరుక్షణం కనబడేది నీ రూపం .. అమ్మా...
నీ ఆత్మ శరీరం పంచి నాకు పునర్జన్మను ఇచ్చిన దివ్య రూపం నీది...
నీ రక్తాన్ని పాలుగా మార్చి నా ప్రాణం నిలిపావు అమ్మా నువ్వు...
నా హృదయం నోచుకుంటే విలవిలలాడావు అమ్మా...
నా మౌనం సైతం అర్థం చేసుకున్న మనస్సు అమ్మా నీది...
నా ప్రాణానికి నీ ప్రాణం సైతం అడ్డు వెయ్యడానికి వెనుకాడని మనస్సు అమ్మా నీది...
నా పెదవి పై చిరునవ్వు నీ గెలుపుగా భావిస్తావు...
చివరి క్షణం వరకు నాకై తపిస్తావు నువ్వు...

అమ్మా...
నా చివరి శ్వాస నిన్ను చూస్తూ నీ ఒడిలో వదలాలని తపిస్తున్నాను...
ప్రేమ అనే పదానికి అర్థం నువ్వు...
నీ ప్రేమ అమూల్యం అమ్మా...
నీ ఋణం తీర్చుకోలేనిది అమ్మా....

ప్రేమతో...
నీ..
బన్ను

అమ్మ

అమ్మ

ఆరోజుకు... - 27-03-2014

నన్ను తీసుకుపో ఆరోజుకు...,

నన్ను నీ వైపుకు లాగిన రోజుకు,
నా చేతిలో నీ చెయ్యేసిన రోజుకు,
ఇంకొక చేతిని నా చుట్టూ వేసుకున్న రోజుకు.

సున్నితంగా నా చెవిలో గుసగుసలు చెప్పిన రోజుకు,
నా బుగ్గపై చిరు ముద్దులు పంచిన రోజుకు,
నా గమ్యానికి దారి చూపిన రోజుకు,

నా చుట్టూ వున్నది శూన్యం,
నువ్వు మాత్రమే నా ఆధారం,

నన్ను తీసుకుపో ఆరోజుకు......

Do not leave my hand

కన్నీళ్ళు - 25-03-2014

కన్నీళ్ళు  -  25-03-2014

ప్రేమ..... ద్వేషం - 25-03-2014

ప్రేమ..... ద్వేషం   -  25-03-2014

తపన - 23-03-2014

తపిస్తోంది.... తపిస్తోంది..... తపిస్తోంది.......మనసు తపిస్తోంది..........

కన్నులు తపిస్తున్నాయి.......

చెవులు తపిస్తున్నాయి...........ప్రేమ కోసం మనస్సు తపిస్తోంది.......

చూపు కోసం కన్నులు తపిస్తున్నాయి......

పిలుపు కోసం చెవులు తపిస్తున్నాయి..........కన్నుల్లో నీ రూపం రెప్పవేయనీకుంది......

హృదయంలో నీ ప్రతిరూపం అలజడి చేస్తోంది......కష్టం, నష్టం నాకే సొంతం......

నీ సంతోషం నా జీవన గమ్యం......బాహ్య రూపం కఠిన శిలలా వున్నా,

అంతరంగం పరితపిస్తోంది.......ప్రియతమా....

నువ్వు కుశలమా?ప్రేమతో,

కవల హృదయం.ప్రేమికుడు - 20-03-2014

ప్రేమ ఒక తియ్యటి విష బీజం. మొక్క పెరిగే కొద్దీ అందంగా వుంటుంది, చివరలో ప్రాణం తీస్తుంది.
ఆడవారి మనసు సముద్రపు అలల లాంటిది. సముద్రపు అలలు పారుతూ వచ్చి తనలో కలిసే నీటిని తనలో ఐక్యం చేసుకొని తనలాగే మార్చేస్తుంది. కలసిన నీరు బయటకు రావాలన్న బయటకు రాలేదు, తన పూర్వ గుణాన్ని పొందలేదు.

మగాడి మనస్సు పారే నది లాంటిది. పారే నీరు తను వెళ్ళే దారిలో అందరికి మంచి చేసి ప్రేమను పంచుతుంది. తనను అహ్వానించినవారిలో కలిసిపోతుంది (సముద్రంలో). కలిశాక తిరిగి రాలేని పరిస్థితి. కలిశాక తన రూపం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, నియంత్రణ కోల్పోతుంది. తనకు సముద్రపు అలలే సర్వస్వం. తనే లోకం. తనే జీవితం. బయటికి రావాలన్నా రాలేదు, మారాలన్నా మారలేదు. తనిక అలా బ్రతకాల్సిందే.

సముద్రపు అల తనకు ఒక పరిదిని ఏర్పరచుకుంటుంది. తనలోని భావోద్యోగాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. తనలోకి వచ్చిన వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, తను ప్రశాంతంగా వుంటే ఇతరులను అలరిస్తుంది. ఫరిది దాటి రమ్మంటే రానంటుంది.

ఆడవారి జీవితానికి, మగవాడి జీవితానికి వున్న వ్యత్యాసం ఇదే.

ఆశ్రయం - Curtosy "Vaarta - 20/02/2005

ఒక రాత్రంతా నిద్రను బహిష్కరించాలని

నిర్ణయించుకున్నాయి కనురెప్పలన్నీ.

ఆ రాత్రి ఎక్కడ తలదాచుకోవడమని

గిలగిలలాడింది నిద్ర.

విచ్చుకుంటున్న ఒక పువ్వును వేడుకుంది

తనకు ఆశ్రయమివ్వవలసిందిగా.

"ఇప్పుడే నీకు ఆశ్రయమిస్తే

నా రేకులన్ని ముడుచుకుపోయి

తెల్లవారేలోగానే నేను నేలమీద రాలిపడి

నా ఉనికినే కోల్పోతాను.

వీల్లేదు పో"

అని తిప్పికొట్టింది ఆ పువ్వు.

దిక్కుతోచని నిద్ర

తన వేదనను గాలికి నివేదిన్చుకుంది.

"చలనం నా జీవం

నిన్ను చేరదీస్తే ఇంకేముంది

ఉన్నచోటనే నిలువునా స్తంభించిపోతాను.

మనిద్దరికీ కుదరదు పో"

అంటూ దులిపేసుకుంది గాలి.

మంచుగడ్డను అభ్యర్థించింది నిద్ర

ఆ ఒక్కరాత్రి తనను ఒళ్ళోకి

తీసుకొమ్మని

ఉలికిపడి మంచుగడ్డ అంది

"నిన్ను నాలోన చేర్చుకుంటే ఇంకేమైనా ఉందా

మిగిలేది స్తబ్దతే.

ఆ గుణమే నా ఒంటబడితే

ఉదయకిరణాల

నులివేచని కౌగిలింతలో

కరిగిపోయే యోగం నాకుండదు.

వెంటనే వెళ్ళిపో".

ఏ గత్యంతరం లేక

చేతులెత్తి మనసుతో మొరపెట్టుకుంది నిద్రతనకు ఆ పూట విడిది కల్పించవలసిందిగా

చెతికెలో సమస్త జీవరాశులను ఆక్రమించే

అదృశ్య శక్తిగా వున్న నిద్రపైన

జాలి కలిగింది మనసుకు.

అయ్యో పాపమనుకుంది.

పంచేంద్రియ సంచార క్రియలను ఆపేసింది.

నిర్వికార స్థితిని తనలో ఆవహింపజేసుకుంది.

అంతే మరి

మసక కమ్మింది మగత పెరిగింది.

అది గమనించిన నిద్ర

కళ్ళలోకి నెమ్మదిగా చొరబడి

విప్పారిన కనురెప్పలను కప్పుకుని

సుఖంగా ఒదిగి పడుకుంది

జాలి మనసుకు

కృతజ్ఞతలర్పించుకుంటూ-- డా,, సి. నారాయణరెడ్డి

05/01/2014 - Life is a Wave

Life is a wave, ups and downs are common. You must sail along with the wave. There will be a cause for everyone’s birth. You should wait for it and fulfill your cause.

04/01/2014 - మా కన్నీటి బొట్టువై రాలావు - ధృవ తారవై వెలిగావు

అంకితం: పెద్ద బుజ్జి కి

ఆట రాదు, పాట రాదు, అమ్మా అని పిలువగ మాట రాదు,
మంచి తెలియదు, చెడు తెలియదు - అమ్మ వెచ్చటి కౌగిలి తప్ప,
లాలనలో పెరిగావు, గోరు ముద్దలు తిన్నావు,
చక్కని చుక్కలా తిరిగావు, మా కన్నీటి బొట్టువై రాలావు,
మినుకు మినుకు తారల మధ్య, ధృవతారవై వెలిగావు.

Aata raadu, Paata raadu, Ammaa ani piluvaa Maata raadu,
Manchi teliyadu, Chedu teliyad - Amma vechati kougili tappa,
Laalanalo perigaavu, Goru muddalu tinnaavu,
Chakkani chukkalaa tirugaavu, Maa kanneeti bottuvai raalaavu,
Minuku minuku taarala madhya, Druva taaravai veligaavu

23/12/2013

నీ అందం శీతాకాలం సాయంకాలం లాంటిది, నీ ప్రేమ వసంత కాలం ఉదయం లాంటిది, నీ మనసు శీతాకాలపు ఉదయం లాంటిది, నీ కోపం శిశిర ఋతువు సంధ్య వేళ లాంటిది, నీ వేదన వర్షా కాలం లాంటిది.

Nee andam seethakaalam sayankalam lantidi, nee prema vasantha kalam lantidi, nee manasu seethakaalapu udayam lantidi, nee kopam sisira ruthuvu lantidi, nee vedana varsha kaalam lantidi

22/12/2013

ఒంపు సొంపుల సయ్యాటల్లో, నడుమొంపుల కవ్వింతల్లో, ఎద పొంగులు ఊరిస్తుంటే, తడి ఆరని పెదవుల మకరందం మైమరపిస్తుంటే, సిగలో మల్లెలు మత్తెక్కిస్తుంటే, నా చెలి వెచ్చటి కౌగిలి రా రామ్మంటుంటే, నేనెట్టా ఆగేదే చిన్నాదానా ! నేనెట్టా ఊరుకొనేదే కుర్రాదానా!

Ompu sompula sayyatallo, nadumompula kavvintallo, eda pongulu orristunte, tadi aarani pedavula makarandam maimarapistunte, sigalo mallelu mattekistunte, naa chili vachati kougili raa rammantunte, nenetta aagede chinnadaana ! Nenetta orrookonede kurraadaana


19/12/2013 - 4

గత జన్మల కర్మ ఫలం, దశ దిశల దైవ బలం, తోడైతే దినం దినం, అవుతుంది జన్మ ధన్యం.

Gatha janmala karma phalam, dasa disala daiva bhalam, thodaithe dinam dinam, avuthundi janma dhanyam

19/12/2013 - 3

కర్తవ్యం నిర్ధేశించాకే పుట్టుక జరుగుతుంది. ఒకరు చెబితే తెలిసేది కాదు కర్తవ్యం, జ్ఞాన సమపార్జనతో నిర్వర్థించేదే కర్తవ్యం.
Karthavyam nirdesinchake puttuka jaruguthundi. Okaru chebithe telisedi kadu karthayam, gnana samaparjanatho nirvarthinchede karthavyam

19/12/2013 - 2

ప్రయత్నం నీ కర్తవ్యం, ఫలితం దైవ నిర్ణయం, ఫలిత నిర్ణయం నీ మూర్ఖత్వం, అంత్య ఫలితం నీకండిన ప్రతిఫలం.
Prayatnam nee karthavyam, phalitham daiva nirnayam. Pahlitha nirnayam nee morrkhatvam, antya phalitham neekandina prathiphalam

19/12/2013 - 1

దూపం వుంది, దీపమ్ వుంది, వెలిగించే నిప్పు వుంది; నిప్పు దైవం, దూపం దీపమ్ దైవత్వం; కానీ నిప్పును సృష్టించే ఆధారం అల్పం.

Doopam vundi, deepam vundi, veliginchina nippu vundi, Nippu daivam, doopam deepam daivatvam, kaani nippunu srustinchina aadharam alpam

ప్రియ సఖి - 2001

ఇదో అద్భుతమైన సాయం సంధ్య వేళ. మనసెందుకో ఉత్సాహంతో ఉరకలేస్తోంది. పక్షుల కిలకిలలు, సెలయేరు గలగలలు, ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి తనకేసి ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒడ్డును ప్రేమగా పలకరించి, ఆర్తిగా చిన్న ముద్దు ఇచ్చి మళ్ళీ నీకై తిరిగొస్తానని చెవిలో మెల్లగా చెప్పి వెనుదిరిగిన అలలు సాయంకాలపు ఆహ్లాదాన్ని రెచ్చగొడుతున్నాయి.

అదో అందమైన మల్లెతోట. మధ్యలో నేనున్నానంటూ అందమైన రాచబాట. నా వద్దకురాఅంటూ మనసారా పిలుస్తున్న మల్లెల సువాసనకు నేనూ నీ వెంటే ఉన్నానంటూ సువాసనలతో జత చేరిన చిరుగాలి. ఇవన్నీ తోడై రారమ్మని పిలుస్తుంటే నా మనస్సు ఆగలేదు. అలా మల్లెలమ్మని పలకరించి వద్దామని రాచబాట గుండా బయలుదేరాను. నీ వెంటే నేనంటూ నా ప్రేయసి కూడా తోడయ్యింది. కొంటె పలకరింపులు, సరసాలకు మల్లెల సువాసన తోడై మత్తెక్కిస్తున్నాయి. నన్నూ మీతో కలసి ఆనందాన్ని పంచుకోనివ్వండని పూల వాన మొదలయ్యింది. మిత్రమా.. క్షేమమా అంటూ అప్పుడప్పుడు మీదపడి పలకరిస్తున్నాయి. ప్రియురాలి ముఖంలో అంతులేని ఆనందం. కేరింతలు కొడుతోంది. ఎగిరి గంతులేస్తోంది. ప్రకృతి అందాల్ని నన్నూ ఆస్వాదించనీ అంటూ వరుణదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడప్పుడే కొండల చాటున దాక్కొంటున్న సూరి బావ నీవుండగా నేనెందుకని జారుకొన్నాడు. మండిపడిన వరుణుడు తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. జివ్వున చలిగాలి ముఖాన్ని తాకింది. తడిబారిన వస్త్ర సంపద నా చెలి అందాల్ని తడుముతూ గిలిగింతలు పెడుతున్నాయి.

చిటపట చినుకుల చిరు సవ్వడి - 1996

చిటపట చినుకుల చిరు సవ్వడిలో,
లయ తప్పించే పిల్లగాలిలో,
నేనుంటే నా చెలి ఒడిలో,
హద్దే వుండదు మాకీ జగతిలో.

Wednesday, December 25, 2013

Kammati Telugu Kavitalu

google.com, pub-5599140869117275, DIRECT, f08c47fec0942fa0